రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని.. బోధనాస్పత్రుల వరకూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిధుల వినియోగం, నిర్వహణ, మెరుగైన వైద్యసేవలందేలా పర్యవేక్షణ తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను జారీచేసినట్టు పేర్కొన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ఈ సొసైటీలకు సభ్యులను నియమించడంతో సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోవడం, సమీక్షలు లేకపోవడం, నిధులు వినియోగం కాకపోవడం వంటివి జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సొసైటీలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయుష్ ఆస్పత్రులకూ సంబంధిత అధికారులతో కార్యవర్గాలను ఏర్పాటు చేశారు